చంద్రబాబు నోట ‘మహానటి’ మాట!
- ‘మహానటి’ బాగుందని తనతో చెప్పారన్న సీఎం చంద్రబాబు
- ఈ సినిమా ఎలా ఉందని నాయకులను ప్రశ్నించిన అధినేత
- ‘మహానటి’ని తప్పకుండా చూస్తానని చెప్పిన వైనం
అమరావతిలో జరిగిన టీడీఎల్పీ సమావేశంలో ‘మహానటి’ గురించి అడిగారట. సావిత్ర్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘మహానటి’ బయోపిక్ బాగుందని ఎయిర్ పోర్ట్ లో కొంతమంది ఇటీవలే తనతో చెప్పారని అన్నారట. ఈ సినిమా ఎలా ఉందని పార్టీ నాయకులను కూడా అడిగారట. సందేశాత్మక చిత్రమైన ‘మహానటి’ని తప్పకుండా చూస్తానని.. జీవిత చరిత్రల ఆధారంగా సినిమాలు నిర్మిస్తే ప్రజలు తప్పకుండా ఆదరిస్తారని చంద్రబాబు అన్నాట్టు సమాచారం.