సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!
- బయోపిక్స్ లో చేస్తానంటున్న తమన్నా
- నిజజీవిత పాత్రలో సాయిపల్లవి
- దుబాయ్ లో మణిరత్నం 'నవాబ్'
* అందాలభామ సాయి పల్లవి తన నిజ జీవిత పాత్రను ఓ సినిమాలో పోషిస్తోంది. నిజజీవితంలో ఎంబీబీఎస్ చదివిన ఈ చిన్నది ఇప్పుడు 'పడిపడి లేచె మనసు' సినిమాలో ఎంబీబీఎస్ చదువుతున్న అమ్మాయిగా నటిస్తోంది. ఇది తనకెంతో ఆనందాన్నిస్తోందని ఈ ముద్దుగుమ్మ చెబుతోంది.
* ప్రముఖ దర్శకుడు మణిరత్నం తన సినిమాల షూటింగులను అరుదుగా విదేశాలలో చేస్తుంటారు. కథ ప్రకారం తప్పనిసరి అయితేనే విదేశాలకు వెళతారు. ఈ క్రమంలో తన తాజా చిత్రం 'నవాబ్' షూటింగ్ కోసం ఆయన దుబాయ్ వెళ్లారు. ప్రస్తుతం అక్కడ కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.