Punjab: అసభ్యకరమైన మెసేజ్ లను పంపుతున్న ప్రొఫెసర్ ను ఉతికేసిన విద్యార్థిని... వీడియో ఇదిగో!
- పంజాబ్ పాటియాలా ప్రభుత్వ మహిళా కళాశాలలో ఘటన
- సెల్ ఫోన్ కు అసభ్య సందేశాలు పంపిన ప్రొఫెసర్
- సహ విద్యార్థినులు, లెక్చరర్స్ తో కలసి దాడి
తనకు అసభ్యకరమైన మెసేజ్ లు పంపి వేధిస్తున్న ప్రొఫెసర్ ను రోడ్డుపైకి లాక్కొచ్చి ఉతికి ఆరేసిందో విద్యార్థిని. పంజాబ్ లోని పాటియాలాలోని ప్రభుత్వ మహిళా కళాశాలలో జరిగిందీ ఘటన. మరిన్ని వివరాల్లోకి వెళితే, గత కొంతకాలంగా ఓ ప్రొఫెసర్, బాధితురాలి సెల్ ఫోన్ కు అసభ్య సందేశాలు పంపుతున్నాడు.
అతని వేధింపులతో సహనం కోల్పోయిన బాధితురాలు, సదరు ప్రొఫెసర్ ను సహ విద్యార్థులు, మరో ప్రొఫెసర్, మహిళా లెక్చరర్లతో కలసి నిలదీసింది. ఈ ఘటన దృశ్యాలు మీడియాకు చిక్కాయి. అతని నిర్వాకంపై పోలీసులకు ఫిర్యాదు చేసిందా విద్యార్థిని. కాగా, ఇటీవలి కాలంలో విద్యార్థినులను వేధిస్తున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. ఇటీవల దేశ రాజధానిలో జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీలోనూ ఇటువంటి ఘటనే నమోదైంది.