డల్లాస్ సభలో భావోద్వేగంతో మెగాస్టార్ చిరంజీవి ప్రసంగం!
- డల్లాస్‌లో చిరు
- ప్రైవేట్ కార్యక్రమంలో ప్రసంగం
- మనస్ఫూర్తిగా మాట్లాడుతున్నానని వ్యాఖ్య
సమయం దాటి పోయింది, అందరూ ఆకలితో ఉన్నారని, కొద్దిగానే మాట్లాడి త్వరగా ఇక్కడి నుంచి వెళ్లిపోదామనుకున్నాను. తానా వారి ఆహ్వానంతో అమెరికాకు వచ్చాను. ఇక్కడి కొంతమంది అభిమానులు నన్ను కలవాలని అనుకుంటున్నారని ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. దీంతో వచ్చాను.. ఇక్కడ ఖానా పేరుతో ఓ అసోసియేషన్ ఉందని కూడా నాకు ఇప్పటివరకు తెలియదు. మీరు గుర్తింపు కోసం కాదు.. సంతృప్తి కోసం సేవ చేస్తున్నారు. నిశబ్ద సైనికులలా మంచి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. నేను మీకు స్ఫూర్తి అన్నారు.. చెప్పాలంటే, మీరే నాకు స్ఫూర్తి" అని చిరంజీవి భావోద్వేగంతో మాట్లాడారు.