'సాహో' తరువాత సినిమా ఆ రోజునే మొదలు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'సాహో' తరువాత సినిమా ఆ రోజునే మొదలు!

  • షూటింగు దశలో 'సాహో' 
  • నెక్స్ట్ మూవీ రాధాకృష్ణతో 
  • నిర్మాతగా కృష్ణంరాజు
  • నాయికగా పూజా హెగ్డే  
'బాహుబలి 2' ప్రేక్షకుల ముందుకు వచ్చి చాలాకాలమే అయింది. ప్రస్తుతం ప్రభాస్ చేస్తోన్న 'సాహో' సినిమా మొదలుకావడానికి కూడా చాలా సమయమే పట్టింది. దాంతో ప్రభాస్ ప్రేక్షకుల ముందుకు రావడానికి చాలా గ్యాప్ తీసుకున్నట్టు అయింది. అందువలన మరోసారి ఈ గ్యాప్ రాకూడదనే ఉద్దేశంతో, ఒకేసారి రెండు సినిమాలు సెట్స్ పై ఉండేలా చూడాలని ప్రభాస్ నిర్ణయించుకున్నాడు.

ఈ కారణంగానే ఒక వైపున 'సాహో' సినిమా షూటింగ్ జరుగుతూ ఉండగానే, మరో వైపున కృష్ణంరాజు సొంత సినిమాను చేయడానికి రెడీ అవుతున్నాడు. 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నాడు. పూజా హెగ్డే కథానాయికగా నటించనున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగును జూలై 7 నుంచి మొదలుపెడతారు. తెలుగుతో పాటు తమిళంలోను ఈ సినిమాను విడుదల చేయనున్నారు.  
prabhas
pooja hegde

More Telugu News