చాలా తప్పు.. ఆ మాటని టీవీల్లో లక్షల మందికి చూపించారు: మండిపడ్డ అల్లు అర్జున్
- ఈ రోజు పవన్ కల్యాణ్ గురించి మాట్లాడి వెళతాను
- కెరీర్ అయిపోతోన్న సమయంలో కొందరు రాజకీయాల్లోకి వస్తారు
- పవన్ కల్యాణ్ అలా కాదు
- టీవీల్లోకి ఎవడెవడో వచ్చి ఏదేదో మాట్లాడుతున్నాడు
ఏదో కెరీర్ అయిపోతోన్న సమయంలో కొందరు రాజకీయాల్లోకి వస్తారు. పవన్ కల్యాణ్ అలాకాదు.. నెంబర్ 1 స్థానంలో ఉన్నప్పుడు దాన్ని వదిలేసుకుని వచ్చారు. కొందరు వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. అప్పట్లో చిరంజీవిపై కూడా విమర్శలు వచ్చాయి. టీవీల్లోకి ఎవడెవడో వచ్చి ఏదేదో మాట్లాడుతున్నారు. కానీ, మొన్న చాలా పర్సనల్గా మాట్లాడారు.. చాలా చాలా చాలా తప్పు.. మాట్లాడినోళ్లది తప్పు, మాట్లాడించినోళ్లది తప్పు, ఈ మాట లక్షల మందికి చూపించారు వాళ్లది పెద్ద తప్పు.. ఆ విషయం నాకు నచ్చలేదు" అని ఆగ్రహం వ్యక్తం చేశాడు.