క్యాస్టింగ్ కౌచ్ పై పోరాటం నేపథ్యంలో సినీ పరిశ్రమలోని కొందరు ప్రముఖులపై నటి శ్రీరెడ్డి చేసిన ఆరోపణలపై ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ స్పందించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, రోడ్లపైకి వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం సరికాదని అన్నారు. తెలుగు ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన బాహుబలి లాంటి సినిమా తీసిన తెలుగు ఇండస్ట్రీని చిన్నబుచ్చవద్దని ఆయన కోరారు. టాలీవుడ్ అంతర్జాతీయ స్థాయికి విస్తరించిన తరుణంలో తాజాగా చోటుచేసుకున్న పరిణామాలు చిత్రపరిశ్రమకు అవమానకరమని ఆయన చెప్పారు. చిత్రపరిశ్రమను రోడ్లమీదకి లాగడం బాధాకరమని ఆయన అభిప్రాయపడ్డారు.