పోలీసుల అదుపులో నటి మాధవీలత... స్టేషన్ లో శ్రీరెడ్డికి వ్యతిరేకంగా దీక్ష!
- నిరసనలకు అనుమతి లేదన్న పోలీసులు
- దీక్షను భగ్నం చేసి, అరెస్ట్
- స్టేషన్ లో కొనసాగుతున్న దీక్ష
ఎవరు వచ్చినా, రాకున్నా తాను మాత్రం స్టేషన్ లోనే దీక్షను కంటిన్యూ చేస్తానని చెప్పింది. లవ్ ఇండియా, లవ్ మై లాంగ్వేజ్ అన్న నినాదాన్ని తన పోస్టుకు జోడించింది. అంతకుముందు ఫిల్మ్ చాంబర్ ముందు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడుతోందని భావించిన పోలీసులు, మహిళా కానిస్టేబుళ్లను పిలిపించారు. అక్కడ మాధవీలతతో కూర్చుని ఉన్న పవన్ అభిమానులను తొలుత పంపించేసిన పోలీసులు, ఆపై ఆమెను స్టేషన్ కు తరలించారు.