ఏపీకి ప్రత్యేక హోదా సాధనలో భాగంగా ప్రత్యేక హోదా సాధన సమితి రేపు బంద్ తలపెట్టిన విషయం తెలిసిందే. రేపటి బంద్ కు వామపక్షాలు, కాంగ్రెస్, జనసేన పార్టీలు ఇప్పటికే మద్దతు ప్రకటించాయి. తాజాగా, వైసీపీ కూడా మద్దతు ప్రకటించింది. ఈ బంద్ లో వైసీపీ శ్రేణులు, నాయకులు పాల్గొననున్నారు. కాగా, బంద్ నేపథ్యంలో జగన్ తన పాదయాత్రకు రేపు విరామం ప్రకటించారు. ఈ విషయాన్ని వైసీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం తెలిపారు. కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గంలోని ముత్యాలంపాడు శిబిరం వద్ద జగన్ బస చేయనున్నారు. ఎల్లుండి ఉదయం జగన్ తన పాదయాత్రను యథావిధిగా కొనసాగిస్తారు.