nani: కొరటాలతో సినిమా గురించి నాని!

షార్ట్స్‌లో చూడండి
'కృష్ణార్జున యుద్ధం' సినిమాతో ఈ రోజునే నాని ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా తరువాత ఆయన నాగార్జునతో కలిసి ఒక మల్టీ స్టారర్ ను చేస్తున్నాడు. ఈ మధ్యనే ఈ సినిమా షూటింగ్ మొదలైంది. ఈ సినిమాలో ఆయన నాగ్ తమ్ముడిగా నటిస్తున్నాడనే టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమా తరువాత ఆయన కొరటాల శివతో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నాడనే వార్త కొన్ని రోజులుగా షికారు చేస్తోంది.

తాజాగా ఈ విషయాన్ని గురించి నాని స్పందిస్తూ " 'నిన్నుకోరి' సినిమా షూటింగు సమయంలో కొరటాల గారిని ఒకసారి కలిశానంతే. ఆ తరువాత ఆయనను కలుసుకునే సందర్భం కూడా రాలేదు. ఆయన తదుపరి సినిమాను గురించి నన్ను సంప్రదించడం ఇంతవరకూ జరగలేదు. ఆయన నెక్స్ట్ మూవీ నేను చేయనున్నట్టుగా వస్తోన్న వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదు. మిగతా ప్రాజెక్టులు చర్చల దశలో వున్నాయి .. అవి ఓకే అయితే నేనే చెబుతాను" అన్నాడు.      
Go Back to Shorts
nani

More Telugu News