నాకింతవరకు అలాంటి అనుభవాలు ఎదురుకాలేదు!: రకుల్ ప్రీత్ సింగ్
- కాస్టింగ్ కౌచ్ గురించి ఎప్పటి నుంచో చర్చ జరుగుతోంది
- ఎవరు అడ్వాంటేజ్ తీసుకున్నా? నిర్ణయం తీసుకోవాల్సింది మనమే
- నేను నా గురించి మాత్రమే మాట్లాడుతున్నాను
తాను కేవలం తన గురించి మాత్రమే మాట్లాడగలనని చెప్పింది. తనకింత వరకూ అలాంటి అనుభవాలు ఎదురుకాలేదని రకుల్ స్పష్టం చేసింది. సినీ పరిశ్రమలో ప్రతిభే అంతిమంగా నిలబెడుతుందని రకుల్ ప్రీత్ తెలిపింది. పరిశ్రమలోకి కొత్తగా వచ్చే అమ్మాయిలకు తాను చెప్పేదేంటంటే.. 'అవకాశాల పేరుతో అడ్వాంటేజ్ తీసుకునేందుకు చాలా మంది ఎదురు చూస్తుంటారు.. వారు కోరుకున్నది ఇవ్వాలా? వద్దా? అన్నది నిర్ణయించుకోవాల్సింది మహిళలే'నని ఆమె స్పష్టం చేసింది. సరైన అవకాశం రావడానికి సమయం పడుతుందని, ఓపిగ్గా ఎదురు చూడాలని సూచించింది.