ఐఫోన్ 8లో స్పెషల్ ఎడిషన్ విడుదల... అమ్మకాల్లో కొంత భాగం సమాజ సేవ కోసం వినియోగం!
- బ్లాక్, రెడ్ రంగుల్లో లభ్యం
- వీటి అమ్మకాల ఆదాయంలో కొంత భాగం గ్లోబల్ ఫండ్ కు
- ఎయిడ్స్ నివారణ కార్యక్రమాలకు వినియోగం
సామాజిక సేవా కోణంలో యాపిల్ ఆర్ఈడీ ఎడిషన్ పేరుతో ఐఫోన్ 8ను విడుదల చేయడం విశేషం. నిజానికి యాపిల్ ఇప్పటికే 16 కోట్ల డాలర్లను గ్లోబల్ ఫండ్ కు అందించింది. ఆర్ఈడీ ఎడిషన్ ఐఫోన్లు రెడ్, బ్లాక్ రంగుల్లో లభిస్తాయి. వీటిని కొనుగోలు చేయడం ద్వారా ఎయిడ్స్ వ్యాధిపై పోరులో పాలు పంచుకున్నట్టు అవుతుందని యాపిల్ ప్రొడక్ట్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ గ్రెగ్ జోస్విక్ సూచించారు.