దేశంలోని అతిపెద్ద క్రీడా సంబరం ఐపీఎల్ శనివారం ఘనంగా ప్రారంభమైంది. ముంబైలోని వాంఖడేలో జరిగిన తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్-ముంబై ఇండియన్స్ జట్లు తలపడ్డాయి. చివరి వరకు హోరాహోరీగా జరిగిన ఈ మ్యాచ్‌లో చివరికి చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. చివరల్లో డ్వేన్ బ్రావో మెరుపు ఇన్నింగ్స్‌తో సీఎస్‌కే జట్టు విజయం సాధించింది.

ఈ మ్యాచ్‌లో మరో విశేషం కూడా ఉంది. ఆల్ రౌండర్ బ్రేవో 400 నంబరున్న జెర్సీ ధరించి అందరినీ ఆకర్షించాడు. సాధారణంగా బ్రేవో 47 నంబరున్న జెర్సీని ధరిస్తాడు. కానీ, తాజా మ్యాచ్‌లో 400 నంబరు జెర్సీ ధరించి అందరినీ ఆకర్షించాడు.

గతేడాది డిసెంబరులో బ్రేవో టీ20ల్లో 400 వికెట్లు సాధించిన తొలి బౌలర్‌గా రికార్డులకెక్కాడు. ఈ రికార్డును సెలబ్రేట్ చేసుకునేందుకే బ్రేవో ఇలా 400 జెర్సీతో కనిపించాడు.