సెల్ కోసం అక్కతో గొడవపడి ఆత్మహత్యకు పాల్పడిన 7వ తరగతి విద్యార్థి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సెల్ కోసం అక్కతో గొడవపడి ఆత్మహత్యకు పాల్పడిన 7వ తరగతి విద్యార్థి

  • సెల్ ఫోన్ విషయంలో అక్క, తమ్ముడి మధ్య గొడవ
  • కిందపడి పగిలిన సెల్ ఫోన్
  • ఆగ్రహంతో అక్కను కొట్టి, ఫ్యాన్ కు ఉరివేసుకున్న తమ్ముడు
సెల్‌ ఫోన్‌ కోసం అక్కతో గొడవపడిన ఓ బాలుడు ఆత్మహత్యకు పాల్పడడం కుత్బుల్లాపూర్ లో విషాదం నింపింది. హైదరాబాదులోని పారిశ్రామిక ప్రాంతం జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని కుత్బుల్లాపూర్‌ గ్రామంలో తూర్పుగోదావరి జిల్లా మల్లాపురంకు చెందిన వాసంశెట్టి శ్రీనివాస్‌, లక్ష్మీ దంపతులు నివాసముంటున్నారు. వారి పిల్లలు మౌనిక ఇంటర్ చదువుతుండగా, శివరోహిత్‌(14) 7వ తరగతి చదువుతున్నాడు.

6 నెలల క్రితం శ్రీనివాస్ ఉద్యోగరీత్యా దుబాయ్ వెళ్లగా, తల్లి, పిల్లలు ఇక్కడే ఉంటున్నారు. నిన్న సాయంత్రం సెల్ ఫోన్ విషయంలో మౌనిక, శివరోహిత్‌ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఫోన్ కిందపడి పగిలిపోయింది. దీంతో మౌనికను కొట్టిన శివరోహిత్, ఆ వెంటనే ఆగ్రహంతో వెళ్లి, ఇంట్లో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీకి తరలించిన పోలీసులు, కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. 
sucide
cell
brother and sister fight

More Telugu News