ఇప్పటివరకు హిందీ చిత్రాలతో అలరించిన బాలీవుడ్ ఎవర్‌గ్రీన్ అందం మాధురీ దీక్షిత్ ఇప్పుడు తన తొలి మరాఠీ చిత్రం 'బకెట్ లిస్ట్'తో మురిపించేందుకు రెడీ అవుతోంది. మకర సంక్రాంతి సందర్భంగా ఈ చిత్రం గురించి ఆమె ఎనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ టీజర్‌ను ఈ 'ఆజ్ నాచ్‌లే' హీరోయిన్ తన ఫ్యాన్స్ కోసం సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. 'గులాబ్ గ్యాంగ్' చిత్రం తర్వాత చాలాకాలానికి ఆమె బకెట్ లిస్ట్ ద్వారా ప్రేక్షకులను పలకరించబోతోంది. ఆమె ప్రస్తుతం నటిస్తున్న ప్రాజెక్టుల విషయానికొస్తే, ఇంద్రకుమార్ తెరకెక్కిస్తున్న టోటల్ ఢమాల్-3లో ఆమె నటిస్తోంది. ఇందులో అనిల్ కపూర్, అజయ్ దేవగణ్, రితేశ్ దేశ్‌ముఖ్, అర్షద్ వార్సీ, జావేద్ జాఫరి తదితరులు నటిస్తున్నారు.