అది భారతీయ జోకర్ల పార్టీ : టీడీపీ నేత రవిచంద్ర
- రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాలపై బీజేపీ నేతలు మాట్లాడరే?
- సోము వీర్రాజు వల్లే బీజేపీ-టీడీపీ మధ్య అంతరం ఏర్పడింది
- వైసీపీ నేతలతో సోము వీర్రాజు చేతులు కలిపారు
- పట్టిసీమలో అవినీతి జరిగిందంటే రైతులే బీజేపీని ఉరితీస్తారు
సోము వీర్రాజు వల్లే బీజేపీ-టీడీపీ మధ్య అంతరం ఏర్పడిందని, రాష్ట్ర ప్రభుత్వంపై రోజూ కేంద్రానికి ఫిర్యాదు చేస్తూ ఏపీకి నిధులు రాకుండా ఆయన చేశారని ఆరోపించారు. వైసీపీ నేతలతో సోము వీర్రాజు చేతులు కలిపారని, ఏపీకి అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. సోము వీర్రాజుకు దమ్ముంటే తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పట్టిసీమలో అవినీతి జరిగిందంటే రైతులే బీజేపీని ఉరితీస్తారని రవిచంద్ర యాదవ్ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు.