పవన్ విమర్శల వెనుక మోదీ హస్తం... ఇక ఎదురుదాడికి దిగండి, వ్యక్తిగత విమర్శలు వద్దు: టీడీపీ శ్రేణులకు చంద్రబాబు ఆదేశం
- నేతలందరూ దీటుగా స్పందించండి
- ఆయన పర్సనల్ లైఫ్ ను టార్గెట్ చేయవద్దు
- జగన్ ను, పవన్ ను మోస్తున్న నరేంద్ర మోదీ
- ఈ ఉదయం టెలీ కాన్ఫరెన్స్ లో చంద్రబాబు
తమిళనాడులో చేస్తున్నట్టుగానే ఏపీలోనూ రాజకీయం చేయాలని బీజేపీ చూస్తోందని ఆరోపించిన ఆయన, నరేంద్ర మోదీ తన భుజాలపై ఓకవైపు పవన్ ను, మరోవైపు జగన్ ను మోస్తున్నట్టు స్పష్టంగా తెలుస్తోందని అభిప్రాయపడ్డారు. తన ప్రసంగంలో ఒక్కసారైనా ప్రధాని నరేంద్ర మోదీ పేరునైనా తలవని పవన్, లోకేష్ పై ఆరోపణలు చేయడం బాధను కలిగించిందని అన్నారు. ఎన్నింటినో త్యాగం చేసిన లోకేష్ రాజకీయాల్లోకి వచ్చాడని, అన్యాయం చేసిన వారిని వదిలేసి, పోరాడుతున్న వారిపై మాటల దాడులు చేస్తుంటే చూస్తూ ఊరుకోబోమని అన్నారు.