షూటింగ్‌లో పాల్గొన్న తొలి రోజే నాతో అలా ప్రవర్తించాడు: సంచలన ఆరోపణ చేసిన రాధికా ఆప్టే
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

షూటింగ్‌లో పాల్గొన్న తొలి రోజే నాతో అలా ప్రవర్తించాడు: సంచలన ఆరోపణ చేసిన రాధికా ఆప్టే

  • దక్షిణాది సినిమా షూటింగ్‌లో ఓ సహ నటుడు  ‌నాతో అస‌భ్య‌క‌రంగా ప్ర‌వ‌ర్తించాడు
  • నా కాలును రుద్దాడు
  • చెంపఛెళ్లుమనిపించాను
తాను నటించిన  తమిళ  సినిమా షూటింగ్ లో తొలి రోజున  ఓ సహ నటుడు త‌న‌తో అస‌భ్య‌క‌రంగా ప్ర‌వ‌ర్తించ‌డంతో అత‌డి చెంపఛెళ్లుమ‌నిపించాన‌ని సినీన‌టి రాధికా ఆప్టే చెప్పింది. తాను షూటింగ్ సెట్‌కి వెళ్లిన తొలి రోజే త‌న‌కు ఈ అనుభ‌వం ఎదురైంద‌ని తెలిపింది. స‌ద‌రు నటుడు తన పక్కనే కూర్చొని, తన కాలిని అసభ్యంగా రుద్దాడని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది.

అంత‌కు ముందు త‌న‌కు ఆ నటుడితో క‌నీసం పరిచయం కూడా లేదని తెలిపింది. కాగా, 2012లో ప్రకాశ్ రాజ్ న‌టించిన త‌మిళ సినిమా 'ధోనీ' ద్వారా రాధికా ఆప్టే ద‌క్షిణాది సినీ ప‌రిశ్ర‌మ‌లో అడుగుపెట్టింది. ఆ సినిమాకు ప్ర‌కాశ్ రాజ్ ద‌ర్శ‌క‌, నిర్మాత‌గా కూడా వ్య‌వ‌హ‌రించిన విష‌యం తెలిసిందే. అనంతరం ఆమె తెలుగులో లెజెండ్‌, లయన్‌, రక్తచరిత్ర వంటి సినిమాలలో, తమిళంలో ‘కబాలి’ సినిమాలోనూ న‌టించిన విష‌యం తెలిసిందే. సినీ న‌టీమ‌ణుల్లో చాలా మంది వ‌రుస‌గా తాము గ‌తంలో లైంగిక వేధింపుల‌కు గురైన విష‌యాల‌ను చెబుతూ వార్తల్లో నిలుస్తున్నారు. 
radhika apte
Tollywood

More Telugu News