నా జీవితంలో ఆనందం ఎక్కడిది?: హీరోయిన్ తమన్నా
- సినిమా జీవితంలో సుఖం ఉండదు
- ఆడంబరాలే తప్ప ఆనందం ఎరుగము
- కష్టాలున్నా నటించాల్సిందే: తమన్నా
స్పాట్ లో 'రెడీ' అని వినబడగానే వెళ్లి నిలుచోవాలని, మనసులో ఎన్ని కష్టాలున్నా ముఖంపై కనిపించకుండా చూసుకోవాలని, సొంత పనులకు, సొంత మనుషులకు సమయాన్ని కేటాయించాలని ఉన్నా అది కుదరదని వాపోయింది. కనీసం నచ్చిన తిండి కూడా తినలేని పరిస్థితుల్లో తామున్నామని తమన్నా వెల్లడించింది. మామూలు అమ్మాయిలను చూస్తుంటే తాను కూడా వారిలా ఉండలేకపోయానన్న బాధ కలుగుతుందని చెప్పుకొచ్చింది. ఈ ఇండస్ట్రీలో అవకాశాల కోసం పరితపించాల్సి వుంటుందని, దర్శకుడు చెప్పినట్టు నడచుకోవాల్సిందేనని, అందుకే తారల జీవితం అద్దాల మేడని పెద్దలు అంటుంటారని వేదాంతం వేదాంతాలు వల్లించింది.