మరో పెళ్లి చేసుకుంటాను.. విడాకులిప్పించండి!: హైకోర్టులో కశ్మీర్ మాజీ సీఎం ఒమర్ పిటిషన్
- 1 సెప్టెంబర్ 1994లో పాయల్-ఒమర్ అబ్దుల్లా వివాహం
- ఒమర్-పాయల్ దంపతులకు ఇద్దరు కుమారులు
- 2009 నుంచి విడిగా ఉంటున్న పాయల్, ఒమర్
దీంతో 2016, ఆగస్టు 30న తనకు పాయల్ నుంచి విడాకులు మంజూరు చేయాలని కోరుతూ ఒమర్ ట్రయల్ కోర్టును ఆశ్రయించగా ఆ పిటిషన్ ను న్యాయస్థానం తిరస్కరించింది. దీంతో తమ మధ్య బంధం తిరిగి కోలుకోలేనంతగా దెబ్బతిందని చెబుతూ, ఒమర్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఒమర్ వాదనలు విన్న జస్టిస్ సిద్ధార్థ మ్రిదుల్, జస్టిస్ దీపా శర్మల ధర్మాసనం తదుపరి విచారణను ఏప్రిల్ 23కి వాయిదా వేసింది. ఆలోగా పాయల్ స్పందన తెలియజేయాలని న్యాయవాదిని ఆదేశించింది.