త్వరలోనే సెట్స్ పైకి రామ్ .. దర్శకుడిగా త్రినాథ్ రావ్ నక్కిన
Add ap7am to your home Screen

త్వరలోనే సెట్స్ పైకి రామ్ .. దర్శకుడిగా త్రినాథ్ రావ్ నక్కిన

  • త్రినాథరావు నక్కినతో రామ్
  • కథానాయికగా అనుపమ 
  • మార్చి 8 నుంచి రెగ్యులర్ షూటింగ్
'ఉన్నది ఒకటే జిందగీ' సినిమాతో హిట్ పడటం ఖాయమని రామ్ అనుకున్నాడు. కానీ ఈ సినిమా కూడా ఆయనకి నిరాశనే మిగిల్చింది. దాంతో ఈసారి ఆయన త్రినాథరావు నక్కినకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. 'సినిమా చూపిస్తమావ'తో యూత్ తో పాటు మాస్ ఆడియన్స్ ను ఆయన మెప్పించాడు. అందువలన ఆయన చెప్పిన కథ వినగానే రామ్ ఓకే అనేశాడట.

ఈ సినిమాలో రామ్ జోడీగా అనుపమ పరమేశ్వరన్ ను ఎంపిక చేసుకున్నారు .. మరో కథానాయిక కోసం అన్వేషణ కొనసాగుతోంది. ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందా అనే ఆత్రుతతో అభిమానులంతా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగును వచ్చేనెల 8వ తేదీ నుంచి ఆరంభించనున్నట్టు సమాచారం. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చుతోన్న ఈ సినిమాలో, ఒక కీలకమైన పాత్రను ప్రకాశ్ రాజ్ పోషించనున్నాడు.  
ram
anupama

More Telugu News