'అందరికీ థ్యాంక్స్'.. సుప్రీంకోర్టు ఆదేశాలపై ప్రియా వారియర్ స్పందన!
- సుప్రీంకోర్టుకి కృతజ్ఞతలు
- 'మాణిక్య మలరయా పూవై' పాటపై అభ్యంతరాలు తెలుపుతూ పలు ప్రాంతాల్లో ఫిర్యాదులు
- దేశంలో ఎక్కడా కేసులు నమోదు చేయొద్దని సుప్రీంకోర్టు ఆదేశాలు- ప్రియా వారియర్
'సుప్రీంకోర్టుకి కృతజ్ఞతలు.. 'మాణిక్య మలరయా పూవై' పాటపై అభ్యంతరాలు తెలుపుతూ నాపైన, మా దర్శకుడు ఒమర్ లాలూపైన హైదరాబాద్‌లో నమోదైన ఎఫ్ఐఆర్ పై స్టే విధించడంతో పాటు ఇతర ఏ ప్రాంతాల్లోనూ కేసులు నమోదు చేయొద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. మాకు సహకరించిన అడ్వకేట్ హారిస్ బీరన్‌కి, మద్దతు తెలిపిన మిత్రులకి, శ్రేయోభిలాషులకి, మీడియాకి థ్యాంక్స్' అని పేర్కొంది.