సినిమా కోసం.. వీధుల్లో అప్పడాలమ్మిన బాలీవుడ్ స్టార్ హీరో!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సినిమా కోసం.. వీధుల్లో అప్పడాలమ్మిన బాలీవుడ్ స్టార్ హీరో!

  • 'సూపర్ 30' చిత్రం కోసం డీగ్లామర్‌గా హృతిక్
  • కథావస్తువుగా బీహార్ లెక్కల మాస్టారు ఆనంద్ కుమార్ జీవితం
  • మరో ప్రయోగాత్మక పాత్ర చేస్తున్న సిక్స్ ప్యాక్ వీరుడు
బాలీవుడ్‌లో హాలీవుడ్ తరహా అందగాడు అనగానే గుర్తొచ్చేది హృతిక్ రోషనే. ఆరడుగుల ఎత్తు, సిక్స్ ప్యాక్ శరీరమున్న అతనంటే పడిచచ్చే అమ్మాయిలకు లెక్కేలేదు. అతనంటే అంత పిచ్చి మరి. అలాంటి హ్యాండ్‌సమ్ ఒక్కసారిగా డీగ్లామర్‌గా కనిపిస్తే ఎలా ఉంటుంది? ఎవరి మాట ఎలా ఉన్నాసరే అతని ఫ్యాన్స్‌‌ మాత్రం కచ్చితంగా అవాక్కవుతారు. ఈ ఉపోద్ఘాతమంతా ఇప్పుడు ఎందుకంటే... హృతిక్ తన తదుపరి చిత్రం 'సూపర్ 30' కోసం చాలా డీగ్లామర్‌గా కన్పించనున్నాడు.

తన కెరీర్‌లో మరో ప్రయోగాత్మక పాత్రను చేస్తున్నాడు. కథానుసారం...అతను జైపూర్ వీధుల్లో సైకిల్‌పై అప్పడాలమ్ముతున్నాడు. బీహార్‌కి చెందిన లెక్కల మాస్టారు ఆనంద్ కుమార్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పాత్రకు తగ్గట్టుగా శరీరాకృతిని మార్చుకోవడం బాలీవుడ్ హీరోలకు కొత్తేమీ కాదు. ఈ విషయంలో అమీర్ ఖాన్‌ను అందరూ ప్రధానంగా చెప్పుకుంటుంటారు. హృతిక్ సైతం ఇప్పుడు ఈ చిత్రం కోసం అప్పడాలమ్ముతూ చాలా సింపుల్‌గా ఆర్డినరీగా కన్పిస్తున్నాడు. ఇక ఈ సినిమాకి కథావస్తువైన ఆనంద్ కుమార్ పేద కుటుంబాలకు చెందిన దాదాపు 30 మంది ఇంజనీరింగ్ అభ్యర్థులకు ప్రతి ఏడాది ఉచితంగా ఐఐటీ శిక్షణ ఇస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
Hrithik Roshan
Anand Kumar
Super 30

More Telugu News