తమన్నా ఆ ఇద్దరు దర్శకులను తెగ ఇబ్బంది పెట్టేస్తోందట!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తమన్నా ఆ ఇద్దరు దర్శకులను తెగ ఇబ్బంది పెట్టేస్తోందట!

  • తమిళంలో 'స్కెచ్' మూవీ ప్రమోషన్స్ లో తమన్నా 
  • తెలుగు 'క్వీన్' రీమేక్ దర్శకుడితో కోల్డ్ వార్ 
  • 'నా నువ్వే' షూటింగ్ కి ఆలస్యంగా రావడం  
తెలుగు.. తమిళ భాషల్లో అగ్రస్థానాన్ని అందుకున్న తమన్నా, ఆ తరువాత హిందీ సినిమాలపై దృష్టిపెట్టింది. ఈ కారణంగా గ్యాప్ రావడంతో తెలుగు .. తమిళ భాషల్లో అవకాశాలు తగ్గాయి. ప్రస్తుతం తెలుగులో ఆమె 'క్వీన్' .. కల్యాణ్ రామ్ తో 'నా నువ్వే'సినిమాలు చేస్తోంది. 'క్వీన్' సినిమా షూటింగుకి చెప్పిన సమయానికి రాకుండా తమన్నా చాలా తలనొప్పి తెప్పిస్తోందట. దాంతో దర్శకుడికి .. ఆమెకి మధ్య కోల్డ్ వార్ జరుగుతోందనే టాక్ వినిపిస్తోంది.

 ఇక 'నా నువ్వే' సినిమా షూటింగుకి కూడా తమన్నా సమయానికి రాకుండా, తన కోసం అంతా ఎదురుచూసేలా చేస్తోందట. దాంతో ఆమె కారణంగానే ప్రాజెక్టు లేట్ అవుతోందంటూ, యూనిట్ లోని సభ్యులంతా తీవ్రమైన అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారట. తమిళంలో 'స్కెచ్' సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటూ, ఇలా ఈ ఇద్దరి దర్శకులను ఇబ్బంది పెడుతోందని చెప్పుకుంటున్నారు.    
tamannah

More Telugu News