కాంగ్రెస్ కు పట్టిన గతి మీకు పట్టకుండా చూసుకోండి: బీజేపీపై టీడీపీ ఎంపీ అవంతీ శ్రీనివాస్ ఫైర్
- పద్మావత్ సినిమాలో హీరోను విలన్ మోసం చేసినట్టుంది
- ఏపీ ప్రజలు సహనం కోల్పోతే ఏం జరుగుతుందో గుర్తుంచుకోండి
- బీజేపీతో లాలూచీ పడాల్సిన ఖర్మ మాకు లేదు
తమకు హైకమాండ్ ప్రజలే అని అవంతీ అన్నారు. రైల్వే జోన్ గురించి ఏపీ బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. విభజన చట్టంలో ఉన్నవాటినే తాము అడుగుతున్నామని, అంతకు మించి ఏదీ అడగడం లేదని చెప్పారు. ఎప్పుడు ఢిల్లీకి వచ్చినా చూద్దాం, చేద్దాం అని సమయం గడిపేస్తున్నారని విమర్శించారు.
తమకు లిప్ సింపతీ అవసరం లేదని అన్నారు. బీజేపీతో లాలూచీ పడాల్సిన ఖర్మ తమకు లేదని చెప్పారు. తమకు మద్దతు తెలిపిన టీఆర్ఎస్ ఎంపీ కవితకు ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. తెలుగు ప్రజలంతా రెండు రాష్ట్రాలుగా విడిపోయినా, కలిసే ఉంటారని చెప్పారు. రానున్న రోజుల్లో తెలంగాణ ప్రయోజనాల కోసం కూడా తాము పోరాటం చేస్తామని అన్నారు.