నాని .. సాయిపల్లవి ఇద్దరూ పారితోషికం పెంచేశారట!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నాని .. సాయిపల్లవి ఇద్దరూ పారితోషికం పెంచేశారట!

  • వరుస హిట్లతో పెరుగుతోన్న నాని మార్కెట్
  • యూత్ లోను .. ఫ్యామిలీ ఆడియన్స్ లోను సాయిపల్లవికి క్రేజ్
  • పెంచిన పారితోషికం ఇవ్వడానికి వెనుకాడని నిర్మాతలు
తెలుగులోని యువ కథానాయకులలో నాని జోరు ఎక్కువగా కనిపిస్తోంది. వరుస సినిమాలతో .. వరుస సక్సెస్ లతో ఆయన అంతకంతకూ తన క్రేజ్ ను పెంచుకుంటున్నాడు. మార్కెట్ పరంగాను ఆయన డిమాండ్ సినిమా సినిమాకి పెరుగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన తన పారితోషికాన్ని పెంచేశాడనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. ఇంతకుముందు ఏడెనిమిది కోట్లు తీసుకునే నాని .. ఇప్పుడు 9 కోట్లు అడుగుతున్నాడని అంటున్నారు.

 నాని సినిమాలు వసూలు చేస్తోన్న మొత్తాలను పరిగణనలోకి తీసుకున్న నిర్మాతలు అందుకు వెనుకాడటం లేదని చెప్పుకుంటున్నారు. ఇక 'ఫిదా' .. 'మిడిల్ క్లాస్ అబ్బాయ్' సినిమాలతో సక్సెస్ లను అందుకున్న సాయిపల్లవి కూడా, తన పారితోషికాన్ని కోటి నుంచి కోటిన్నరకి పెంచేసిందని అంటున్నారు. యూత్ లోను .. ఫ్యామిలీ ఆడియన్స్ లోను ఆమెకి గల క్రేజ్ అందుకు కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  
nani
sai pallavi

More Telugu News