జనసేన పార్టీ విధానాలను ఏడు సిద్ధాంతాలుగా విభజించి ప్రకటించిన పవన్ కల్యాణ్
- అవినీతి, అక్రమాలపై రాజీలేని పోరాటం చేస్తాం
- పర్యావరణాన్ని పరిరక్షించే విధానం అనుసరిస్తాం
- కులాలను విస్మరించి రాజకీయాలు చేయలేం
- అందుకే ముఖ్యంగా కులాలని కలిపే ఆలోచన విధానం తీసుకున్నాం
మన భారతదేశంలో కులాలను విస్మరించి రాజకీయాలు చేయలేమని, అందుకే తమ సిద్ధాంతాల్లో ముఖ్యంగా కులాలని కలిపే ఆలోచన విధానం తీసుకున్నానని పవన్ కల్యాణ్ తెలిపారు. తాను ఏ ఒక్కరితోనూ వ్యక్తిగత శత్రుత్వం పెట్టుకోదలుచుకోలేదని అన్నారు. ఏ పార్టీ అయినా సిద్ధాంతాలు లేనిదే ముందుకు వెళ్లలేదని అన్నారు. 2019లో తెలంగాణలోనూ పోటీ చేస్తానని స్పష్టం చేశారు. ఈ సమావేశం అనంతరం పవన్ కల్యాణ్ కొత్తగూడెం బయలుదేరారు.