ట్రంప్ దెబ్బకు పాక్ విలవిల.. మద్దతుగా నిలిచిన చైనా
- పాక్ కు ఆర్థికసాయం ఆపేసిన అమెరికా
- పాక్ మంచి దేశమన్న చైనా
- తీవ్రవాదంపై పోరాటం చేస్తోందని కితాబు
ఉగ్రవాది హఫీజ్ సయీద్ ఆధ్వర్యంలోని సంస్థలు నిధులు సేకరించరాదని పాక్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు, పాక్ మిత్ర దేశం చైనా ఎప్పట్లానే తన ఒంటెద్దు పోకడలను ప్రదర్శించింది. పాకిస్థాన్ చాలా మంచి దేశమని... ఉగ్రవాదులపై పోరాటంలో భాగంగా ఎన్నో త్యాగాలు చేసిందని ప్రశంసించింది. ఉగ్రవాదంపై పోరాటం చేస్తోందని కితాబిచ్చింది.