పొద్దున్నే 4 గంటలకు నిద్ర లేపి ఈ ప్రశ్నలేంటి?: మీడియాపై నటి రాధిక విమర్శలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పొద్దున్నే 4 గంటలకు నిద్ర లేపి ఈ ప్రశ్నలేంటి?: మీడియాపై నటి రాధిక విమర్శలు

  • రజనీకాంత్ గురించి మాట్లాడాలని అడుగుతున్నారు
  • దీనికి మించిన సమస్యలు ఉన్నాయి
  • ముందు రజనీని డిసైడ్ చేసుకోనివ్వండి
మీడియా వ్యవహరిస్తున్న తీరు పట్ల ప్రముఖ సినీ నటి రాధిక అసహనం వ్యక్తం చేశారు. పొద్దున్న 4 గంటలకే న్యూస్ ఛానల్స్ తనను నిద్ర లేపుతున్నాయని... ఎందుకూ పనికిరాని డిబేట్స్ లో పాల్గొనాలని కోరుతున్నాయని ఆమె మండిపడ్డారు. రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీకి సంబంధించి మాట్లాడాలని అడుగున్నాయని అన్నారు. సమాజంలో దీనికి మించిన పెను సమస్యలు ఉన్నాయని... వాటి గురించి చర్చించాలని సూచించారు. రజనీ రాజకీయ అరంగేట్రంపై మాట్లాడుతూ, మొదట ఆయనను డిసైడ్ చేసుకోనివ్వాలని చెప్పారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు.
rajanikanth
radhika

More Telugu News