ఫైబర్ కేబుల్ కట్ చేసిన ఘటనపై మంత్రి లోకేశ్ మండిపాటు!
- రాష్ట్రపతి పర్యటన కార్యక్రమం ప్రసారం కాకుండా ఫైబర్ కేబుల్ కట్
- తూర్పుగోదావరి జిల్లాలో చోటుచేసుకున్న సంఘటన
- సమగ్ర దర్యాప్తు జరపాలని కలెక్టర్ కి ఆదేశాలు
ఈ సంఘటనపై సమగ్ర దర్యాప్తు జరపాలని, ఇందుకు కారకులైన వారికి శిక్షపడేలా చూడాలని ఆదేశించారు. ప్రజలకు మెరుగైన సేవలను తక్కువ ధరకే అందించేందుకు ప్రభుత్వం పాటుపడుతుంటే, ఇలాంటి ఘటనలకు పాల్పడటం చట్టరీత్యా నేరమని, అటువంటి వారిని ఉపేక్షించే ప్రసక్తే లేదని అన్నారు. కాగా, ఆరు చోట్ల కేబుల్ ని కట్ చేసినట్టు అధికారులు గుర్తించారు. అయితే, కేబుల్ కట్ చేసినప్పటికీ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి రాష్ట్రపతి పర్యటన ప్రసారమయ్యేలా చూశారు.