అఖిల్ తో వార్ వార్తలపై స్పందించిన నాని!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అఖిల్ తో వార్ వార్తలపై స్పందించిన నాని!

  • వచ్చేనెల 21న 'మిడిల్ క్లాస్ అబ్బాయి'రిలీజ్ 
  • మరుసటి రోజునే అఖిల్ 'హలో' విడుదల
  • అఖిల్ తో ఫ్రెండ్షిప్ దెబ్బతినకూడదనే ఉద్దేశంతో నాని  
దిల్ రాజు నిర్మాణంలో .. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందిన 'మిడిల్ క్లాస్ అబ్బాయి' వచ్చేనెల 21వ తేదీన విడుదల కానుంది. ఆ మరుసటి రోజునే అఖిల్ మూవీ 'హలో' ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో బాక్సాఫీస్ దగ్గర నాని - అఖిల్ మధ్య వార్ జరగనుందన్నట్టుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. జోరుగా షికారు చేస్తోన్న ఈ వార్తల పట్ల నాని తనదైన శైలిలో స్పందించాడు.

 యుద్ధం అఖిల్ తో కాదనీ, సల్మాన్ ఖాన్ తోనని నాని ట్వీట్ చేశాడు. ఈ క్రిస్మస్ కి 'మిడిల్ క్లాస్ అబ్బాయి' .. 'టైగర్'కి 'హలో' చెబుతాడు .. అది తెలుగు సినిమా పవర్ .. అని అన్నాడు. హిందీలో సల్మాన్ చేసిన 'టైగర్ జిందా హై' క్రిస్మస్ కానుకగా వచ్చేనెల 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తోన్న సంగతి తెలిసిందే. అఖిల్ తో నానికి మంచి స్నేహం వుంది. తమ మధ్య ఏదో యుద్ధ వాతావరణం నెలకొంటున్నట్టుగా వార్తలు వస్తుండం నానికి నచ్చలేదట. తమ మధ్య ఎలాంటి మనస్పర్థలు రాకూడదనే ఉద్దేశంతోనే నాని ఈ విధంగా స్పందించాడనే టాక్ వినిపిస్తోంది.  
nani
sai pallavi

More Telugu News