వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరూ ఇతర పార్టీల్లోకి వెళ్లరు!: గిడ్డి ఈశ్వరి తీరుపై స్పందించిన బొత్స‌
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరూ ఇతర పార్టీల్లోకి వెళ్లరు!: గిడ్డి ఈశ్వరి తీరుపై స్పందించిన బొత్స‌

  • స్వార్థ ప్ర‌యోజ‌నాల కోసమే వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీ మారారు
  • త‌మ నియోజ‌క వ‌ర్గాల అభివృద్ధి కోస‌మ‌ని చెప్పుకుంటున్నారు
  • ఇంత‌వ‌ర‌కు ఏం అభివృద్ధి చేశారో చెప్పాలి?
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి కూడా పార్టీ మారే సూచ‌న‌లు ఉన్నాయ‌ని వార్తలు వ‌స్తోన్న విష‌యం తెలిసిందే. దీనిపై  వైసీపీ నేత బొత్స సత్యనారాయణ స్పందించారు. ఈ రోజు విశాఖ‌ప‌ట్నంలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ... త‌న‌కు తెలిసినంత‌వ‌ర‌కు త‌మ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరూ ఇతర పార్టీల్లోకి వెళ్ళరని స్ప‌ష్టం చేశారు.

ఇప్ప‌టివ‌ర‌కు త‌మ పార్టీ నుంచి టీడీపీలోకి వెళ్లిన‌ ఎమ్మెల్యేలంద‌రూ వారి స్వార్థ ప్ర‌యోజ‌నాల కోసమే వెళ్లారని వ్యాఖ్యానించారు. త‌మ నియోజ‌క వ‌ర్గ‌ అభివృద్ది కోసం వెళ్లామ‌ని చెప్పుకుంటోన్న పార్టీ మారిన శాస‌న‌స‌భ్యులు ఇప్ప‌టివ‌ర‌కు ఏం చేశారో చెప్పాలని నిల‌దీశారు. పార్టీ మారిన శాస‌న‌స‌భ్యుల‌పై చర్యలు తీసుకునే వరకు అసెంబ్లీని బహిష్కరిస్తామ‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు.   
mlas
botsa satyanarayana
YSRCP
Telugudesam

More Telugu News