చంద్రబాబు చాలా బాధపడ్డారు: నంది అవార్డుల వివాదంపై స్పందించిన లోకేశ్
- ఏపీలో ఆధార్ కార్డు లేని వారు విమర్శలు చేస్తున్నారు
- కొందరు హైదరాబాద్లో కూర్చొని ఏపీ ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నారు
- హైదరాబాద్లో కూర్చొని ఏం చేయాలో చెబితే ప్రజలు హర్షించబోరు
నంది అవార్డుల ప్రకటనపై విమర్శలు వస్తుండడంతో సీఎం చంద్రబాబు నాయుడు చాలా బాధపడ్డారని లోకేశ్ తెలిపారు. హైదరాబాద్లో కూర్చొని ఏం చేయాలో చెబితే ప్రజలు హర్షించబోరని వ్యాఖ్యానించారు. నంది అవార్డులపై విమర్శలు చేస్తోంది ఇద్దరు, ముగ్గురు మాత్రమేనని అన్నారు.