భారత్ లో పాగా వేసేందుకు ఐసిస్ యత్నం.. భారీగా నిధుల సరఫరా.. ఇంటెలిజెన్స్ అప్రమత్తం!
- గల్ఫ్ దేశాల నుంచి హవాలా మార్గంలో నిధులు
- భారీ విధ్వంసానికి కుట్ర
- ప్రణాళికలను భగ్నం చేసిన కేరళ పోలీసులు
ఈ క్రమంలో డబ్బును ఇక్కడకు తరలించడానికి హవాలా మార్గాలను ఎంచుకుంది. అయితే ఈ ప్రణాళికలను కేరళ పోలీసులు భగ్నం చేశారు. భారత్ లో భారీ విధ్వంసానికి ఐసిస్ నిధులను సమకూరుస్తోందన్న ఇంటెలిజెన్స్ రిపోర్టుతో కేరళ పోలీసులు రంగంలోకి దిగారు. దాడులు జరిపి ఐసిస్ సానుభూతిపరులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా గల్ఫ్ దేశాల నుంచి హవాలా రూపంలో తస్లీం అనే వ్యక్తికి డబ్బు వస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఇతని వద్ద నుంచి ఐసిస్ సానుభూతిపరులకు డబ్బు పంపిణీ అవుతోంది.