ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు కోచ్‌గా ఆస్ట్రేలియా మాజీ సారథి రికీ పాంటింగ్?
- గతంలో ముంబై ఇండియన్స్ కోచ్‌గా పనిచేసిన రికీ
- 2015లో విజయం సాధించిన ముంబై ఇండియన్స్
- పాంటింగ్‌ని కలిసిన రాజస్థాన్ రాయల్స్?
గతంలో ముంబై ఇండియన్స్ జట్టుకి రికీ కోచ్‌గా పనిచేశారు. ఆయన ఆధ్వర్యంలో 2015 ఐపీఎల్ కప్‌ను ముంబై ఇండియన్స్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు దిల్లీ డేర్‌డెవిల్స్ డైరెక్టర్ పదవికి రాజీనామా చేసిన టీమిండియా మాజీ పేసర్ టీఏ శేఖర్ ముంబయి ఇండియన్స్ జట్టులో చేరుతున్నట్లు తెలుస్తోంది. చాలామందితో తాము చర్చలు జరుపుతున్నట్టు దిల్లీ డేర్‌డెవిల్స్ సీఈవో హేమంత్ దవా తెలిపారు. పరస్పర విరుద్ధ ప్రయోజనాల నిబంధన మేరకు ఢిల్లీ మెంటార్ రాహుల్ ద్రవిడ్ జట్టును వీడిన సంగతి తెలిసిందే.