బాలకృష్ణతో సెల్ఫీలు దిగిన నారా లోకేశ్.. బస్సులో ప్రయాణించిన టీడీపీ నేతలు!
- బస్సులో టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
- పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టుల పరిశీలన
- పట్టిసీమ వృథా అంటూ ఆనాడు ప్రతిపక్ష పార్టీలు రాద్ధాంతం చేశాయి-లోకేశ్
ఈ సందర్భంగా నారా లోకేశ్ మాట్లాడుతూ... పట్టిసీమ వల్ల నేడు రాయలసీమకు నీరందుతోందని అన్నారు. అనంతపురం జిల్లాకు కియా మోటార్స్ తెచ్చిన ఘనత టీడీపీ సర్కారుకి దక్కుతుందని చెప్పారు. సత్వరం నీటి ప్రాజెక్టులను పూర్తి చేయడం వల్లే కియా మోటార్స్ ను తీసుకురాగలిగామని తెలిపారు. పట్టిసీమ వృథా అంటూ ఆనాడు ప్రతిపక్ష పార్టీలు రాద్ధాంతం చేశాయని, ఇప్పుడు రైతులు ఆ ప్రాజెక్టు ప్రతిఫలం అనుభవిస్తున్నారని చెప్పారు.
