సంచలనాలకు కేంద్ర బిందువుగా తరచూ వార్తల్లో నిలిచే దక్షిణాది నటి భువనేశ్వరి కుమారుడు మిథున్ శ్రీనివాసన్ ఓ కాలేజీ అమ్మాయిని వేధించిన కేసులో అరెస్టయిన సంగతి తెలిసిందే. శ్రీనివాసన్ కు సంబంధించిన మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.

తమ ఇంట్లో పని చేసేందుకు శ్రీలంక నుంచి ఓ యువతిని పిలిపించుకున్న భువనేశ్వరి, ఆపై ఆమెతోనే తన కుమారుడి పెళ్లి చేసినట్టు తెలుస్తోంది. ఆపై కొడుకుతో కలిసి ఆ అమ్మాయి తల్లిదండ్రులను బెదిరించినట్టు పోలీసు కేసు కూడా ఆమెపై నమోదైంది. ఈ కేసు మద్రాసు హైకోర్టులో ప్రస్తుతం విచారణ దశలో ఉండటం గమనార్హం. ఇప్పుడు తాజాగా కుమారుడి నిర్వాకం భువనేశ్వరిని మరోసారి వార్తల్లో నిలిపింది.