పెద్ద దర్శకులతో అలా చెబుతాను .. చిన్న దర్శకులతో ఇలా అంటాను: కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి
- సీన్ మరింత బాగా రావడానికే ట్రై చేస్తాను
- పెద్ద దర్శకులను రిక్వెస్ట్ చేస్తాను
- చిన్న దర్శకులకు చెప్పి చూస్తాను
- ఫైనల్ గా నిర్ణయం వారిదే
"త్రివిక్రమ్ .. పూరీ .. శ్రీను వైట్ల .. తేజ వంటి దర్శకులతో ఏదైనా సినిమా చేస్తున్నప్పుడు, ఈ సీన్ ను ఇలా చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను సార్ .. ఏమంటారు? అని అడుగుతాను. బావుందని చెప్పేసి వాళ్లు కూడా కొన్ని సూచనలు చేస్తారు. అలా సీన్ మరింత బాగా వచ్చేలా అక్కడ చేసేయడం జరుగుతుంది. ఇక చిన్న దర్శకులు చెప్పింది విని ..నేను ఇలా చేస్తాను .. ఎలా వుందో చూడండి. మీరు చెప్పింది చేస్తాను .. అలాగే నేను అనుకున్నది కూడా తీసుకోండి. ఆ తరువాత ఏది బాగుంటే అది ఉంచేయండి అని చెబుతాను. తాము చెప్పినట్టు చేస్తే చాలని వాళ్లంటే .. సైలెంట్ గా అలాగే చేసేస్తాను" అంటూ చెప్పుకొచ్చారు.