చిరంజీవి ఫ్యామిలీని అవమానించారు.. మూడేళ్లలో ఒక్కరికీ అవార్డు ఇవ్వలేదు: బన్నీ వాసు
- మెగా ఫ్యామిలీకి అన్యాయం జరిగింది
- ఒక్క మెగా హీరోకు కూడా ఉత్తమ నటుడు అవార్డు రాలేదు
- అల్లు అర్జున్ కు క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవార్డు రావడం ఏమిటి?
ఈ మూడేళ్ల కాలంలో మెగా హీరోలు ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేశారని చెప్పాడు. రెండు కమర్షియల్ హిట్స్ ఇచ్చిన అల్లు అర్జున్ కు క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవార్డు ఇవ్వడమేంటని ప్రశ్నించాడు. ఇది ముమ్మాటికీ మెగా ఫ్యామిలీని అవమానించడమేనని చెప్పాడు. చిరంజీవి ఫ్యామిలీ ఈ విషయాన్ని పట్టించుకోలేదని... అయినప్పటికీ, ఆవేదనను తట్టుకోలేక తాను ప్రశ్నిస్తున్నానని తెలిపాడు.
గతంలో మగధీర సినిమాకు కూడా అన్యాయం జరిగిందని... జాతీయ స్థాయిలో ఈ సినిమాకు గుర్తింపు లభించినా, రాష్ట్ర స్థాయిలో మాత్రం గుర్తింపు దక్కలేదని బన్నీ వాసు అన్నాడు. ఈ మూడేళ్ల అవార్డుల గురించి మాత్రమే తాను మాట్లాడటం లేదని... చిరంజీవి కుటుంబానికి గత కొన్నేళ్లుగా అన్యాయం జరుగుతోందని చెప్పాడు. కొన్నేళ్లుగా సినీ పరిశ్రమకు 50 శాతం ఆదాయం మెగా ఫ్యామిలీ నుంచే వస్తోందని తెలిపాడు.