సెక్స్ సీడీతో అడ్డంగా దొరికిన హార్ధిక్ పటేల్.. సోషల్ మీడియాలో వైరల్!
- ఓ మహిళతో సన్నిహితంగా ఉన్న హార్ధిక్ పటేల్
- గుజరాత్ ఎన్నికల వేళ బయటపడిన సీడీ
- రాజకీయంగా ఉపయోగించుకునేందుకు బీజేపీ ఎత్తులు
- బీజేపీ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమన్న పటేల్ ఉద్యమ నేత
తన సెక్స్ సీడీ బయటపడడంపై హార్ధిక్ పటేల్ స్పందించాడు. తనను దెబ్బకొట్టి, గుజరాత్ ఎన్నికల్లో లాభ పడేందుకే ఈ సీడీని బయటపెట్టారంటూ బీజేపీపై దుమ్మెత్తిపోశాడు. గుజరాత్ మహిళల ప్రతిష్ఠను దిగజార్చేందుకు చేస్తున్న ప్రయత్నంలో ఇదో భాగమని విమర్శించాడు. హార్ధిక్ పటేల్ ఎలాంటివాడో బీజేపీకి బాగా తెలుసని, అందుకే ఇటువంటి చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఇప్పటికైనా ఇటువంటి దిగజారుడు రాజకీయాలు మానుకుంటే మంచిదని బీజేపీకి హితవు పలికాడు. ఇలాంటిదేదో జరుగుతుందని తాను ముందే ఊహించి చెప్పానని హార్ధిక్ అన్నాడు. ఈ సీడీని దేశం బయటే మార్ఫింగ్ చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశాడు.