త్వరలోనే ఒక కుటుంబ కథా చిత్రాన్ని చేయబోతున్నామని నటుడు రాజశేఖర్ తెలిపారు. ఆ సినిమాలో తన సహనటిగా జీవిత నటిస్తారని చెప్పారు. 'గరుడ వేగ' సినిమా విజయోత్సవ యాత్ర సందర్భంగా ఏలూరులోని అంబికా డీలక్స్ థియేటర్ లో ఆయన మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు.

 ఈ సందర్భంగా జీవిత మాట్లాడుతూ, ప్రేక్షకులను కలవడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. ఇక్కడే కాకుండా యూఎస్ లో కూడా 'గరుడ వేగ' హిట్ టాక్ ను సొంతం చేసుకుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజశేఖర్, జీవితల కుమార్తెలు శివాని, శివాత్మికలు కూడా పాల్గొన్నారు.