శునకం చెవిలో అమెరికా అధ్యక్షుడి రూపం... వైరల్ అవుతున్న ఫొటో.. మీరూ చూడండి!
- అచ్చం ట్రంప్ లాగే కనిపిస్తున్న కుక్క చెవిలోపలి భాగం
- ఇంటర్నెట్ సెన్సేషన్‌గా మారిన ఫొటో
- రకరకాల కామెంట్లు చేస్తున్న నెటిజన్లు
అమెరికాకు చెందిన జేడ్ రాబిన్‌సన్ పెంపుడు కుక్క చీఫ్‌కి ఈ మధ్య చెవిలో ఇన్‌ఫెక్షన్ వచ్చింది. అందుకోసం చెవిని ఫొటో తీసి వెటర్నరీ డాక్టర్‌కి పంపించింది. అదే ఫొటోను తన స్నేహితురాలికి చూపించినపుడు డొనాల్డ్ ట్రంప్ ఆకృతిని గమనించింది. దీంతో జేడ్ ఆ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అక్కడ చూసిన వాళ్లు కూడా అచ్చం డొనాల్డ్ ట్రంప్ లాగే ఉందని అన్నారు. అలా అలా ఈ ఫొటో కాస్తా వైరల్‌గా మారింది. ఈ ఫొటో మీద నెటిజన్లు వివిధ రకాల కామెంట్లు చేస్తున్నారు. 'కుక్కకు ట్రంప్ వ్యాధి', 'పాపం చీఫ్' అంటూ హాస్యోక్తులు కురిపించారు.