అనుష్క బర్త్ డే సందర్భంగా 'భాగమతి' ఫస్టులుక్ రిలీజ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అనుష్క బర్త్ డే సందర్భంగా 'భాగమతి' ఫస్టులుక్ రిలీజ్

  • 'భాగమతి'గా అనుష్క 
  • దర్శకుడిగా అశోక్
  • సంక్రాంతికి రిలీజ్ చేసే ఆలోచన
అందాల కథానాయికగా అశేష ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకుంటోన్న అనుష్క పుట్టిన రోజు రేపు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, ఆమె తాజా చిత్రం 'భాగమతి' నుంచి కొంతసేపటి క్రితం ఫస్టులుక్ ను రిలీజ్ చేశారు. పాడుబడిన బంగ్లాలో .. మాసిపోయిన బట్టలతో .. ఇష్టానుసారంగా వదిలేసిన జుట్టుతో కథానాయిక కనిపిస్తోంది. ఒక చేతిలో రక్తం అంటుకున్న సుత్తి .. మరో చేతిని గోడకి ఆనించి అరచేతిలో మేకు దిగగొట్టుకుని .. తనని తాను శిక్షించుకోవడం ఈ పోస్టర్ లో కనిపిస్తోంది.

రాచరికపు స్త్రీకి చెందినవిగా కనిపిస్తోన్న రెండు కాళ్లు ఇనుప గొలుసులతో బంధించబడి ఇదే పోస్టర్ లో కనిపిస్తున్నాయి. ఇది డిఫరెంట్ కంటెంట్ తో తెరకెక్కిన సినిమా అనే విషయాన్ని ఈ పోస్టర్ చెప్పేస్తోంది. అసలు కథ ఏమై ఉంటుందా? అనే ఆసక్తిని రేకెత్తిస్తోంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితమవుతోన్న ఈ చిత్రానికి 'పిల్ల జమీందార్' ఫేమ్ అశోక్ దర్శకత్వం వహించాడు. దాదాపు 35 - 40 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమాను, సంక్రాంతికి విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు.     
anushka

More Telugu News