ధోనీ జట్టును వీడిన మరుక్షణం టీమిండియాలో శూన్యత తథ్యం: ఆసీస్ దిగ్గజ బ్యాట్స్ మన్
- టీమిండియాకు ధోనీ పెద్ద బలం
- కీలక సమయాల్లో వేగంగా నిర్ణయం తీసుకోగలడు
- ధోనీ అనుభవం కోహ్లీకి ఎంతో ఉపయోగపడుతుంది
ధోనీ బ్యాటింగ్ లో ఇప్పుడు ఫెయిల్ అయినా, అతనికి అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తాడని అన్నాడు. ధోనీకి ఉన్న అనుభవం టీమిండియాకు చాలా మేలుచేస్తోందని చెప్పాడు. కీలక సమయాల్లో ధోనీ వేగంగా నిర్ణయం తీసుకోగలడని అన్నాడు. ప్రస్తుత విరాట్ కోహ్లి నేతృత్వంలోని భారత జట్టుకు ధోని అవసరం చాలా ఉందని గిల్లీ చెప్పాడు. జట్టు నుంచి ధోని వెళ్లిపోతే అతని స్థానాన్ని ఎవ్వరూ పూడ్చలేరని స్పష్టం చేశాడు.