మేము అడుగుతోంది ఒకటి.. మీరు చెబుతోంది మరొకటి!: అసెంబ్లీలో ఉత్తమ్‌కుమార్ రెడ్డి
- రైతులపై పడుతోన్న రుణాల వడ్డీ భారాన్ని చెప్పాలని అడిగాం
- పోచారం శ్రీనివాస్ రెడ్డి మేము అడిగింది చెప్పడం లేదు
- ఇంతవరకు రైతులకు తెలంగాణ ప్రభుత్వం ఏమీ చేయలేదు
రుణమాఫీ విషయంలో తెలంగాణ ప్రభుత్వం రైతులపై వడ్డీ భారాన్ని ఎంతగా తగ్గించిందో చెప్పాలని ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. వడ్డీ భారాన్ని కూడా తామే భరిస్తామని గతంలో శాసనసభలో సీఎం చెప్పారని గుర్తు చేశారు. ఇప్పటివరకు ఒక్కరూపాయయినా ఆ భారాన్ని ప్రభుత్వం భరించిందా? అని ప్రశ్నించారు. ప్రభుత్వం హామీ నిలబెట్టుకోలేదని తేల్చి చెప్పారు. దీంతో స్పందించిన పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. తాను ఒక్కొక్కటిగా అన్ని విషయాలను చెప్పుకుంటూ వస్తున్నానని, అన్ని విషయాలను ఒకే సమయంలో చెప్పలేం కదా? అని అన్నారు.