కొత్త ప్రయాణం మొదలు పెట్టా... ఫేస్ బుక్ లో రేవంత్ రెడ్డి పోస్ట్!
- ఢీల్లీలోని రాహుల్ గాంధీ నివాసంలో రేవంత్ రెడ్డి
- కొత్త ప్రయాణం మొదలు పెట్టానని హర్షం వ్యక్తం చేసిన రేవంత్
- రేవంత్ రెడ్డికి స్వీట్లు తినిపించిన రాహుల్ గాంధీ
తనతో పాటు టీడీపీకి చెందిన మాజీ మంత్రులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్యెల్యేలు, నియోజకవర్గాల ఇంచార్జిలు కూడా కాంగ్రెస్ లోకి చేరారని అన్నారు. టీడీపీతో పాటు అధికార తెరాస కు చెందిన నాయకులూ కూడా తన నాయకత్వంలో పార్టీలోకి చేరారని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జి కుంతియా, పీసీసీ చీఫ్ ఉత్తమ్, తదితర పార్టీ నాయకులు పాల్గొన్నారని పేర్కొన్నారు.

