తెలంగాణ వస్తే ప్రజాస్వామ్యం మరింత వర్థిల్లుతుందని అనుకుంటే దానికి భిన్నంగా ఉంది: ఉత్తమ్ కుమార్ రెడ్డి
- తెలంగాణలో నిరసన తెలిపే అవకాశం కూడా లేదా?
- రైతులు పండించే పంటలకు మద్దతు ధర రావడం లేదు
- హమాలీ ఛార్జీలు వసూలు చేయకూడదు
- రైతుల సమస్యలపై అత్యవసరంగా చర్చ చేపట్టాలని వాయిదా తీర్మానం ఇచ్చాం
ప్రభుత్వ తీరు నచ్చకపోతే నిరసనలు చేసుకునే అవకాశం ఇవ్వాలని, దానికి కూడా అవకాశం ఇవ్వలేదని మండిపడ్డారు. రైతుల నుంచి హమాలీ ఛార్జీలు వసూలు చేయకూడదని అన్నారు. ప్రభుత్వం రైతుల సమస్యలను పరిష్కారించాలని అన్నారు. రైతుల సమస్యలపై అత్యవసరంగా చర్చ చేపట్టాలని వాయిదా తీర్మానం ఇచ్చామని, ప్రభుత్వం మొండిగా వ్యవహరించిందని ఆయన అన్నారు.