రేవంత్ పై చంద్రబాబు నిర్ణయమేంటి?... ప్రతి ఒక్కరిలో ఉత్కంఠ!
- టీటీడీపీ నేతలతో చంద్రబాబు సమావేశం
- ఏం జరిగిందో వివరించిన ఎల్ రమణ
- రేవంత్ వైఖరిని విమర్శిస్తూ ఆరోపణలు
- బాబు నిర్ణయమే కీలకం!
వీరందరితో మాట్లాడిన చంద్రబాబు, ఏం జరిగిందన్న విషయాన్ని తెలుసుకున్నారు. రేవంత్ రెడ్డి న్యూఢిల్లీ పర్యటనకు వెళ్లి వచ్చిన నాటి నుంచి జరిగిన పరిణామాలను ఎల్ రమణ వివరించినట్టు తెలుస్తోంది. ఆయన కాంగ్రెస్ లోకి వెళ్లనున్నారని, వెళ్లే ముందు ఇంతకాలం అన్నంపెట్టిన పార్టీపై బురద చల్లేందుకు ప్రయత్నిస్తున్నారని కాస్తంత కటువుగానే వ్యాఖ్యానించినట్టు సమాచారం. ఎల్ రమణ చేస్తున్న ఆరోపణలను రేవంత్ అడ్డుకోబోగా, చంద్రబాబు కల్పించుకుని తనకన్నీ తెలుసునని ఒకింత ఆగ్రహంగా అన్నట్టు పార్టీ వర్గాల సమాచారం. పార్టీ నేతలతో చంద్రబాబు సమావేశం ముగియగా, ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకుంటారోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.