పాకిస్థాన్ అత్యంత ప్రమాదకారి... ప్రపంచానికే ముప్పు ఉంది: యూఎస్ మాజీ సెనేటర్ సంచలన వ్యాఖ్యలు
- అణ్వాయుధాలపై పాక్ కు నియంత్రణ లేదు
- ఆయుధాలను దొంగిలించి, ఉగ్రవాదులకు అమ్మే అవకాశం
- సైన్యం నుంచి ఉగ్రవాదులు కొనుగోలు చేసే అవకాశం
పాక్ లోని అణ్వాయుధాలను ఆ దేశ సైన్యం నుంచి ఉగ్రవాదులు కొనుగోలు చేసే అవకాశం కూడా ఉందని... ఆ ఆయుధాలను అమెరికా మీదే ప్రయోగించే ప్రమాదం కూడా ఉందని ప్రెస్లర్ అన్నారు. ఇది కేవలం అమెరికాను మాత్రమే కాకుండా, మొత్తం ప్రపంచాన్ని భయపెట్టే అంశమని తెలిపారు. ఈ కారణాల వల్లే పాకిస్థాన్ కు ఎఫ్-16 యుద్ధ విమానాలు, ఇతర ఆయుధాల అమ్మకాలను అమెరికా ఆపేసిందని... భారత్ కు అమెరికా దగ్గర కావడానికి ఇది కూడా ఒక కారణమని చెప్పారు. అణ్వాయుధాలపై నియంత్రణ లేని దేశం పాకిస్థాన్ అని అన్నారు.