రేవంత్ రెడ్డిని పిలిపించాలని ఆదేశించిన చంద్రబాబు!
- తొమ్మిది రోజుల పర్యటన తరువాత హైదరాబాద్ చేరిన చంద్రబాబు
- నేడు 11 గంటలకు తెలంగాణ నేతలతో భేటీ
- రేవంత్ ను కూడా సమావేశానికి పిలవాలన్న బాబు
- మధ్యాహ్నం తరువాత విజయవాడకు పయనం
అంతకుముందు కొంతమంది రాష్ట్ర అధికారులతో సమావేశమైన ఆయన, ఇటీవల ప్రారంభించిన 'చంద్రన్న బీమా' వంటి పథకాల అమలును అడిగి తెలుసుకున్నారు. 11 గంటలకు టీటీడీపీ నేతలతో సమావేశమైన తరువాత, మధ్యాహ్నం తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ను ఆయన కలుస్తారు. ఇటీవల గవర్నర్ తల్లి మృతి చెందిన నేపథ్యంలో ఆయన్ను పరామర్శించనున్నారు. ఆపై సాయంత్రం మూడు గంటలకు చంద్రబాబు విజయవాడకు బయలుదేరుతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.